చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికులను మడపాం, నాతవలస టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేయాలని

Spread the love

Chilakapalem toll plaza workers to be adjusted in Madapam and Nathavala toll plazas

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికులను మడపాం, నాతవలస టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేయాలని లేనిపక్షంలో గ్రాట్యూటీ, తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు,పి.తేజేశ్వరావు డిమాండ్ చేసారు.

చిలకపాలెం టోల్ ప్లాజా ఎత్తివేసిన కారణంగా నాతవలస, మడపాం టోల్ ప్లాజాల్లో టోల్ రుసుమును పెంచి ఆదాయం తగ్గకుండా సర్దుబాటు చేసిన నేషనల్ హైవే అధికారులు రోడ్డున పడ్డ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను మడపాం, నాతవలస టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేయాలని లేనిపక్షంలో గ్రాట్యూటీ, తగిన పరిహారం చెల్లించాలని, వెంటనే యూనియన్ తో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం స్పందనలో కలెక్టర్ శ్రీ కేశ్ బి లాఠకర్ కు వినతిపత్రం అందించారు.

ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చిలకపాలెం టోల్ ప్లాజా ఎత్తివేసి ఇక్కడి ఆదాయం నాతవలస, మడపాం టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేసిన నేషనల్ హైవే అధికారులు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను రొడ్డున పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ హైవే అధికారులు కార్మికులను రొడ్డున పడేసి గ్రాట్యూటీ, పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తుంటే కేంద్ర బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులు పట్ల అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిదర్శనమన్నారు.

వేల కోట్ల రూపాయలు టోల్ రుసుములు వసూలు చేస్తున్న హైవే అధికారులు,కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 106 మంది చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికులను 2 టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేసి విధుల్లో కొనసాగించాలని, గ్రాట్యూటీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలని, కార్మికుల సమస్య పరిష్కరించాలని కోరుతూ నేషనల్ హైవే పిడిని పలుమార్లు కలిసి విన్నవించామని కార్మికుల సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

Related Posts

You cannot copy content of this page