Chief Minister Jagananna’s mission is to increase technical knowledge among students… MLA Shilpa Ravi Reddy
విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయం… ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి…
నంద్యాల మున్సిపాలిటీ మరియు నంద్యాల మండలం లోని ఎనిమిదో తరగతి చదువుతున్న 2022 మంది విద్యార్థులకు గర్ల్స్ హైస్కూల్ నందు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌లను MLA శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇషాక్ భాషా విద్యార్థులకు అందజేశారు._
ఈ సందర్భంగా MLA శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అంటే చిన్న చూపే కాకుండా ఉన్నతమైన చూపుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని అన్నారు, ఆ సంకల్ప నిర్ణయంతోనే ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ విప్లవానికి నాంది పలికారు అని,విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆశయమని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వస్తున్నారని అన్నారు నాడు-నేడు పథకం ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల రూపురేఖలే మార్చేశారని,కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు,అందులో భాగంగానే నంద్యాల మున్సిపాలిటీ మరియు నంద్యాల మండల పరిధిలోని ఎనిమిదో తరగతి చదువుతున్న 2022 మంది విద్యార్థులకు బైజుస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌లను ఈరోజు వారికి అందించడం జరిగిందని తెలిపారు._
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి, రాష్ట్ర దృశ్యకళాలు డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి ,డీఈవో అనురాధ, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ ,ఎంఈఓ బ్రహ్మం నాయక్ ,ఎమ్మార్వో శ్రీనివాసులు ,మరియు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు ,వైఎస్ఆర్సిపి వార్డు ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు…