సాక్షిత శంకర్ పల్లి: జ్ఞాన తెలంగాణ చత్రపతి శివాజీ మహారాజ్ 139 వ జయంతి వేడుకలు, పొద్దుటూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన, చత్రపతి శివాజీ
జయంతి వేడుకలకు, పొద్దుటూరు గ్రామ ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నరసింహ…, కమిటీ ఆధ్వర్యంలో, గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, వీరనారీమణి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు.
అనంతరం చత్రపతి శివాజీ భారీ విగ్రహానికి పూలమాలవేసి, కొబ్బరికాయలు కొట్టారు .., ఈ సందర్భంగా భారతదేశం కోసం ఆయన చేసిన, విశేషమైన పోరాటాన్ని, త్యాగాన్ని, స్మరించుకుంటూ…, శివాజీ మాతృమూర్తి, ఆయనకు జన్మించిన గడ్డపైన, ప్రజల పైన, ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పించిందని, పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం, తన తల్లి వద్దనే నేర్చుకున్నాడని, తన చిన్న వయసులోనే, సకల విద్యలలో,యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడని. భారతదేశ రాజులలోనే, గొప్ప పరిపాలకుడిగా, చత్రపతి శివాజీ చరిత్రలో నిలిచిపోయాడని, నేటి యువత కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా, నిర్వాహకులు అందరికీ స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు, మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, గ్రామ ఎంపిటిసి బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, కాషాయపు జెండా ఎత్తి, బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, మాజీ గ్రామపంచాయతీ కో ఆప్షన్ మెంబర్ కవేలి జంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్స్, కవేలి రామ్ రెడ్డి, చాకలి రాములు, కవేలి గోవర్ధన్ రెడ్డి నాని రత్నం. సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రామ్ రెడ్డి, నాని మల్లేశ, యువజన సంఘాల నాయకులు, యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.