58 జీఓ లో బాగంగా రాజోలి మండలం పెద్ద తాండ్ర పాడు గ్రామానికి 11 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు మరియు వడ్డేపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు..
కళ్యాణ లక్ష్మీ,షాది ముబరకు పేదలకు వరం..
పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా..
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి..
పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు..
ప్రభుత్వ పథకాల ద్వార అత్యధికంగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ది..
ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసే వరకు ప్రభుత్వ పథకాలు..
అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ..
కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు అన్నారు అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న వివిధ గ్రామాల వారికి 218 మంది లబ్ధిదారులకు 21,825,288/- కోట్ల రూపాయల గాల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రభుత్వ పథకాల ద్వార అత్యధికంగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ లబ్దిపొందడం జరుగుతుంది అని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు.
పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని…దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని…కేవలం బిఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు.ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అని అన్నారు.గర్భిణి స్త్రీలకు ప్రభుత్వం న్యూట్రీషన్లు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..