సిపిఐ పార్టీ నాయకుల విలెకరుల సమావేశం లో చాడ వెంకట రెడ్డి

Spread the love

Chada Venkata Reddy in the gathering of CPI party leaders

సిపిఐ పార్టీ నాయకుల విలెకరుల సమావేశం లో చాడ వెంకట రెడ్డి

సాక్షిత న్యూస్, మంథని

అంబేద్కర్ చాలా గొప్పవాడని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి అన్నారు. సోమవారం మంథనిలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి సిపిఐ పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మంథని ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి మన దేశానికి తలమానికమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడని కొనియాడారు. సమానత్వం కోసం సమ సమాజం కోసం ఆయన పాటుపడ్డాడని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కలిపితే పడ్డ ప్రాథమిక హక్కులు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కాలరాయబఢ్ఢాయని విమర్శించారు. నరేంద్ర మోడీ సాయిబాబా వరవరరావు గోరేగాం సంఘటన గౌరీ లంకేష్ హత్య లాంటివి చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడని అన్నారు . మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగమే లేకుండా పోయిందని రాజ ద్రోహం కేసులు పెట్టి మేధావులను జైల్లలో నిర్బంధిస్తున్నారని విమర్శించారు.

అంబేద్కర్ రాజ్యాంగంలో సమానత్వం కోసం పాటుపడితే మోడీ రాజ్యాంగాన్ని మారుస్తామని పరిస్థితికి వచ్చారని అన్నారు. విద్యా వైద్యం పక్కా ఇల్లు లేని పరిస్థితి పేదలకు దాపించిందన్నారు. ఈనాడు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్ శక్తులుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిన తర్వాత సెక్యులరిజమే లేకుండా పోయిందన్నారు. మోడీ ప్రభుత్వం మనువాదాన్ని తెరపైకి తెచ్చి అల్ప సంఖ్యాకుల మీద మైనార్టి ల మీద దాడులకు తెగ పడుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తుందని అన్నారు. విభజన హామీలు అమలు చేయని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇవాళ తెలంగాణలో భాగవేయాలని చూస్తుందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పార్లమెంటులో అమలైన తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వ హ్యంలో నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు సామాన్యునికి అందుబాటు లేకుండా పోయాయి అని అన్నారు. మేము సిపిఐ జాతీయ పార్టీగా ప్రజాతంత్ర, ప్రగతిశీల పార్టీలను కలుపుకొని ఒక వేదిక తయారు చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. బిజెపిని ఓడించేందుకు సెక్యులర్ శక్తులను ఏకం చేసేందుకు ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణలో సిపిఐ పార్టీ ఉద్యమాలు పోరాటాలు చేసి భూములు పేదలకు పంచిన పార్టీగా గుర్తింపు ఉందన్నారు. తెలంగాణలో కూడా ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల మంజూరు కోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుందని అన్నారు. మంథనిలో సిపిఐ పార్టీని విస్తరింప చేసేందుకు సొమవారం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఒక కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సదానందం, మాజీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ గోవర్ధన్, మంథని మండల కార్యదర్శి ఉప్పల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page