రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు.
రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు మరోసారి కేంద్రం వారితో చర్చలు జరపడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు నాల్గుసార్లు చర్చలు జరపగా.. అసంపూర్ణంగా ముగిశాయి. మద్దతు ధరకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లోనే పాగా వేశారు రైతులు. దీంతో ఈరోజు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ రైతు సంఘాలతో మరో దఫా చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉంటే రైతుల సమస్యలపై ఈనెల 21న యూపీ, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ధర్నాలకు సిద్ధమైంది భారతీయ కిసాన్ యూనియన్.