అంబరాన్నంటిన సంబరాలు

Spread the love

అంబరాన్నంటిన సంబరాలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజవకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

హుజూరాబాద్ నియోజకవర్గంపై ఎగిరేది కాంగ్రెన్ జెండానే : కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ చోటు కల్పించడంతో హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తం సంబరాలు అంబరాన్నంటాయి. హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా వొడితల ప్రణవ్కు అవకాశం కల్పించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తండోపతండాలు తరలివచ్చి నంబరాలు నిర్వహించుకున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంపై ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో పాటు సింగాపూర్, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు వందలాదిగా తరలిచివచ్చి టపానులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా స్థబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వొడితల ప్రణవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.

| హుజూరాబాద్ నియోజకవర్గంపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంపై ఈ ఎన్నికల్లో కాంగ్రెన్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Whatsapp Image 2023 10 28 At 3.52.58 Pm

Related Posts

You cannot copy content of this page