ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

Spread the love


Celebrating Republic Day…

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఇందిరమ్మ కాలనీ లో మరియు భౌరంపేట్ ముదిరాజ్ సంగం నందు జెండాను ఎగురవేసారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానీయులు డా. బీ ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్లు మరియు BRS నాయకులు , కార్యకర్తలు , గ్రామ ప్రజలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page