SAKSHITHA NEWS

ఘనంగా జస్టీస్ శివ శంకర్ జయంతి వేడుకలు

  • ప్రభుత్వ హాస్పిటల్ లో పెషేంట్లకు పండ్ల పంపిణి

కమలాపూర్ సాక్షిత

బీసీ రిజర్వేషన్ ల కోసం పోరాడిన వ్యక్తి జస్టీస్ పుంజాల శివ శంకర్ అని కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ అన్నారు.కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో స్థానిక కమలాపూర్ బస్టాండ్ ఆవరణలో జస్టీస్ పుంజాల శివశంకర్ 95 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ మాట్లాడుతూ పుంజాల శివ శంకర్ అతి పేదరికంలో జన్మించి బీసి రిజర్వేషన్ ల కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా చిర కాలం నిలిచిపోయారని అన్నారు. అలాగే వివిధ శాఖలలో ఆయన కేంద్ర మంత్రి గా పని చేశారని మరియు గవర్నర్ గా, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పని చేశారని బీసీ ల హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ ల కోసం తమ గళాన్ని వినిపించిన వ్యక్తి అని ఆయన ఆశయాల సాధన కోసం పని చేస్తామని ఆయన అన్నారు.

అనంతరం పుంజాల శివ శంకర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కమలాపూర్ ప్రభుత్వ అస్పత్రి లో పెషేంట్ల కు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తడక శ్రీకాంత్, మాట్ల రమేష్,డా,, మౌటం కుమారస్వామీ, పుల్లూరి శ్రీనివాస్ రావు, కెత్తే రవి, బొల్లం రాజిరెడ్డి, దూడ శ్రీకాంత్, గొట్టె రవి, కొండపాక మణేష్, రెక్కల నారాయణ రెడ్డి, గంధసిరి అనీల్, వెంగళ విజయ్, పుల్ల శోభన్, మౌటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS