SAKSHITHA NEWS

ఘనంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు

సాక్షిత శంకరపల్లి : బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శిశుపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో శిశుపాల్ కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ మంత్రి రావుల చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్, దిలీప్ రెడ్డి, భరత్ గౌడ్, శ్రీకాంత్, కార్తీక్, తేజ, నందు, పండు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS