కుటుంబాలను నిలబెట్టేందుకే CDEW..

Spread the love

*కుటుంబాలను నిలబెట్టేందుకే CDEW..*

*-సైబరాబాద్ లో CDEW  సెంటర్లు..*                       

*-కౌన్సెల్లింగ్ చేయనున్న నిపుణులు*

*-మహిళ సమస్యలు చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తాం: సీపీ*

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (Centre For Development And Empowerment Of Women) కౌన్సెల్లింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు డిజిపి శ్రీ అంజనీ కుమార్, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ మహిళల చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు “Safe City Project” లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో CDEW సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.

కుటుంబ కలహాలతో విడిపోతున్న ఎంతో మందికి వారి సమస్యలను సామారస్యంగా  పరిష్కరించుకోవడానికి CDEW సెంటర్లు దోహదపడతాయన్నారు.

ఈ CDEW సెంటర్ల ద్వారా ముఖ్యంగా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కేసులను త్వరతగతిన పరిష్కరించడానికి సాధ్యమవుతుందన్నారు.

ప్రతీఒక్కరి జీవితాలలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయని,వాటిని అర్థం చేసుకుని, బంధాలను నిలబెట్టే విధంగా ఈ సెంటర్లు తోడ్పడతాయన్నారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించి వారు విడిపోకుండా ఉండేందుకు చూస్తామన్నారు.

ప్రతీ CDEW కేంద్రాలలో అనుభవమున్న ఇద్దరు కౌన్సిలర్లను ఏర్పాటు చేశామన్నారు. వీరు కేవలం కౌన్సిలింగ్ నిర్వహించడమే గాక ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారన్నారు.

ఇందులో భాగంగానే మహిళా సమస్యలు మరియు చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కల్పించేందుకు AV ఆడియో విజువల్ వాహనాన్ని ప్రారంభించామన్నారు.

అతి త్వరలోనే మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఆర్సిపురం పోలీస్ స్టేషన్లలోనూ CDEW కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే బాలానగర్ జోన్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో CDEW సెంటర్ ను బాలానగర్ డిసిపి టి శ్రీనివాస్ రావు, ఐపీఎస్., సిబ్బందితో కలిసి ప్రారంభించారు.

“మీ భద్రతే మా బాధ్యత” అనే మోటోనే మన సైబరాబాద్ పోలీసుల పనితీరును ప్రతిబింబిస్తుందన్నారు.

సీపీ గారి వెంట W&CSW విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి నితిక పంత్, ఐపీఎస్., మేడ్చల్ ట్రాఫిక్ డిసిపి డివి శ్రీనివాసరావు, పేట్ బషీరాబాద్ ఏసిపి రామలింగరాజు, మేడ్చల్ లా అండ్ ఆర్డర్ ఏసిపి వెంకట్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి, అల్వాల్ ఇన్ స్పెక్టర్ గంగాధర్, పేట్ బషీరాబాద్ ఇన్ స్పెక్టర్  ప్రశాంత్, షామీర్పేట్ ఇన్ స్పెక్టర్  సుధీర్, మేడ్చల్ ఇన్ స్పెక్టర్  రాజశేఖర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ డిఐ లక్ష్మీనారాయణ రెడ్డి, షీ టీం ఇన్ స్పెక్టర్, షీ టీం ఇంచార్జ్ ఇన్ స్పెక్టర్  వేణు మాధవ రెడ్డి, సిసిఎస్ ఇన్ స్పెక్టర్  శంకరయ్య, షీ టీం సిబ్బంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page