SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా చిట్యాల ,మరియు ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణా రైతు దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భాన్ని పురస్కరించుకుని రైతులకు వ్యవసాయంలో మెరుగైన పద్దతులను తెలియపర్చడం లో కోర్ కార్బన్ ఎక్సోల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ నల్గొండ వారు ఈ కార్యక్రమం ప్రధాన పాత్ర వహించి ముఖ్యంగా వరి సాగులో మీథేన్ అనబడే కాలుష్య కారకం విడుదల అయ్యి పంటను అత్యంత విషపూరితమైతుండటం వల్ల దాన్ని తగ్గుదలకు అనుకూలంగా వుండే తడి-పొడి పద్ధతి గురించి అర్థవంతంగా వివరించారు.


ఈ తడి పొడి విధాన పద్ధతిని అవలంబించడం ద్వారా 15-30 శాతం నీటి వినియోగం తగ్గడంతో పాటు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా వాతావరణనకు ప్రమాదకార కాలుష్య కారకమైన మీథేన్ వాయువు విడుదల కూడా ఈ పద్ధతులో తగ్గుతుంది.ఈ విధానంలో వరి సాగు చేయడం ద్వారా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది చేను క్రింద పడిపోదు చీడపీడలు ముఖ్యంగా దోమకాటు ఉదృతి తక్కువగా ఉంటుంది. పంట దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎన్ డిఆర్ఎస్ నల్గొండ క్లస్టర్ సూపర్వైజర్ జాల లింగస్వామి చిట్యాల మండల కోఆర్డినేటర్ ఉయ్యాల రాజు ,సాగర్ల నరేష్ గారూ మరియూ ఎస్వీఎన్ డిఆర్ఎస్ ఎన్జీఓ డైరెక్టర్ గౌస్ మియా తో పాటు తదితరులు పాల్గొని కార్యక్రమం ని విజయవంతం చేయడం జరిగింది. రైతు సంక్షేమం కోసం సేవలందిస్తున్న సంస్థ డైరెక్టర్ ఎండి గౌస్ మియా కి రైతులందరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Z 23

SAKSHITHA NEWS