SAKSHITHA NEWS

సిసి రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన

సాక్షిత, తిరుపతి బ్యూరో:
తిరుపతి నగర పరిధిలోని మూడు ప్రాంతాల్లో గురువారం సిసి రోడ్ల పనులకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈమేరకు నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుపతి నగరాభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉన్నదని, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మిగిలిన మునిసిపల్ కార్పొరేషన్ల కన్నా అభివృద్ధిలో ముందున్నదని చెబుతూ అధికారులను, సిబ్బందిని అభినందించారు. రానున్న కాలంలో నగరంలోని ప్రధాన సమస్యలు అన్నిటిని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంఆర్ పల్లి ఏరియాలోని 19 రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని, ఇప్పుడు ప్రారంభించినవే కాక మిగిలిన వాటిని కూడా ఆధునికరించడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమన స్పష్టం చేసారు. మేయర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలిలు మాట్లాడుతూ 19వ డివిజన్ న్యూ బాలాజీ కాలనీలో 67 లక్షలతో, ఉల్లిపట్టెడ, వాసవి నగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో సిసి రోడ్ల కోసం 1 కోటి 36 లక్షలతో, అదేవిధంగా 22వ డివిజన్ పద్మావతి నగర్లో 70 లక్షలతో సిసి రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఈ రోడ్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్.కె. బాబు, ఇతర కార్పొరేటర్లు డాక్టర్ అనీష్, తిరుత్తణి శైలజ, దొడ్డారెడ్డి ప్రవల్లిక రెడ్డి, నాయకులు మాజి జెడ్.పి.టి.సి వెంకటమునిరెడ్డి, డిష్ చంద్ర, మబ్బు నాధముని రెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ దేవదానం, తిమ్మారెడ్డి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి, అనీల్, కుమార్, మనోహర్, తలారి రాజేంధ్ర, మున్సిపల్ ఎస్.ఈ మోహన్, ఎంఈ చంద్రశేఖర్, డిఈ మహేష్, కాంట్రాక్టర్లు ఈశ్వర్, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS