SAKSHITHA NEWS

ఎపి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను ఇవాళ అసెంబ్లీ ముందుకు రానుంది. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో, మంత్రి అంజాద్ బాషా శాసన మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2023-24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా వుండనుందని అంచనా

2023-24 బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
వైయస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైయస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు
వైయస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు
రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
లా నేస్తం రూ.17 కోట్లు
జగనన్న తోడు రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
వైయస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు
వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు
అమ్మ ఒడి రూ.6500 కోట్లు
మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు


ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు
మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
ఎనర్జీ రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు
గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279


SAKSHITHA NEWS