నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం….. రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీరు
ఎమ్మెల్యే రాము ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న టిడిపి నేతలు
మారుమూల ప్రాంతాలకు సైతం బొట్లలో వెళుతూ ఆహారం పంపిణీ…. రోజుకు 6వేల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న టిడిపి నేతలు
పుట్టగుంట వద్ద బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ,ఎస్పీ గంగాధర్ రావు
మండలంలోని ముంపు గ్రామాల పరిస్థితిని కలెక్టర్ బాలజికు వివరించిన అధికారులు, టిడిపి నేతలు
ప్రజలందరూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన: కలెక్టర్ బాలాజీ
నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. ఎగువ నుండి భారీగా వస్తున్న వరద నీటితో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో బుడమేరు ప్రవహించడంతో మండలంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు సహ కార్యక్రమాలు అందించడంలో టిడిపి శ్రేణులు నిమగ్నమయ్యారు.
పుట్టగుంట గ్రామం వద్ద వరద ఉధృతిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని ముంపు గ్రామాల పరిస్థితిని అధికారులు మరియు టిడిపి నేత తులసి బాబు కలెక్టర్ కు వివరించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్….. పలు సూచనలు చేశారు.
బస్సులు వెళ్లలేని మారుమూల గ్రామాల ముంపు ప్రాంతాల ప్రజలను బోట్ల ద్వారా టిడిపి నేతలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు…. బోట్ల ద్వారా ఆహారాన్ని తరలించి ముంపు ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. పలు ముంపు గ్రామాల్లోని ప్రజలను బోట్ల ద్వారా టిడిపి నేతలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా బుడమేరు ప్రవహిస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని…. ముఖ్యంగా అధికారుల సూచనలను తప్పకుండా ప్రజలు పాటించాలని కలెక్టర్ బాలాజీ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే రాము ఆదేశాల మేరకు 24 గంటలు ముంపు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని టిడిపి నేతలు అన్నారు. ముఖ్యంగా మండలంలో ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించడమే కాకుండా….. పునరావస కేంద్రాల్లో ప్రజలకు రోజుకు 6వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని టిడిపి నాయకులు తెలియచేశారు.
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో టిడిపి నేత కామేపల్లి తులసి బాబు, నందివాడ మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్ రావు,పేద్దు శ్రీకాంత్, ప్రదీప్, ఇస్సాకు, రూరల్ సీఏ సోమేశ్వరరావు , డిప్యూటీ తాసిల్దార్ మల్లికా, రెవెన్యూ ఆర్.ఐ గణేష్,ఆయా గ్రామాల టిడిపి నేతలు,పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.