తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – బిఎస్పీ
— కాలయాపన లేకుండా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించాలి
- తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
— ప్రియదర్శిని మేడి
చిట్యాల సాక్షిత ప్రతినిధి
తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాల్లో తక్షణమే ప్రారంభించాలన్నారు.తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టపోయిన వరి పంటకు తోటలకు నష్టపరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి 7,000 కేంద్రాలు తెరిచామని కొనుగోలు కూడా ప్రారంభం చేశామని ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉన్నదని మార్కెట్లలోకి వచ్చిన ధాన్యం వారాలు గడిచిన కొనకపోవడంతో రైతులు మార్కెట్లలోనే ఉండి ధాన్యం కాపలా కాస్తున్నారు. గత రెండు రోజులుగా అకాల వర్షాల వల్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం తడిచిపోయిందని ఈ నష్టానికి కమిటీలే భరించాలి. గత రెండు రోజులుగా అకాల వర్షాలు పిడుగుపాటు వల్ల పంట నష్టం జరిగింది ప్రభుత్వ వెంటనే కొనుగోలు ప్రారంభించాలని నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని వారన్నారు. ఎకరాకు రూ. 40 వేలకు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు కోతల సమయంలో అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లుతున్నది.ధాన్యం మార్కెట్లకు తెచ్చినప్పటికీ కొనుగోలు జాప్యం చేయడంతో వర్షాల బారిన పడి ధాన్యం తడిసింది .దీంతో కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. తూకం వేయడానికి తేమను సాకుగా చూసి కాలయాపన చేస్తున్నారు.మార్కెట్ కు వచ్చిన ధాన్యానికి వర్షం నుండి రక్షణ కల్పించే పరికరాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులు ఆందోళనకు దిగక ముందే ప్రభుత్వం కొనుగోలు వేగవంతం చేయాలని బిఎస్పి పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.