బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కాంగ్రెస్లో చేరారు. దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు గులాబీ నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెండోరోజు దిల్లీ పర్యటనలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ఇంటికి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లిన ఎంపీ వెంకటేశ్ నేత ఇరువురి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ కు బయలుదేరి వెళ్లారు.…