అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా?
హైదరాబాద్:
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్ వద్ద ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యా ప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత లను ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నా రు.నిన్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై నిరసనకు బీఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ నిరసనలో పాల్గొనేం దుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద పహారాకాస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహనిర్బంధం చేస్తున్నారు.
కాగా.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కొంపల్లి దండేమూడి ఎన్‌క్లేవ్‌లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.