SAKSHITHA NEWS

126- జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని తెలంగాణ మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ నందు డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గెలుపును బలపరుస్తూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం శ్రీనివాస శాఖ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుల సంఘాలకు ప్రత్యేక స్థలాన్ని, భవనాలను కేటాయిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ బిఆర్ఎస్ యేనన్నారు. ముచ్చటగా మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో
ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు
తెలంగాణ మున్నూరు కాపు సంఘం శ్రీనివాస్ నగర్ శాఖ అధ్యక్షులు నాగు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆవుల నర్సయ్య, ఉపాధ్యక్షులు మునిగడప భాస్కర్, గోనె సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు ఆవుల కృష్ణ, సహ కార్యదర్శులు ఆకుల రాజేందర్, ఆవుల నరేందర్, కోశాధికారి శ్రీరాముల రమేష్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 3.22.57 Pm

SAKSHITHA NEWS