దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ చౌరస్తాలోని బాలాజీ ఫంక్షన్ హాల్ నందు దాదాపు 60 మంది టి.ఎస్.కే.బి ఆటో స్టాండ్, గండి మైసమ్మ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు ఆటో పన్నులు రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అన్నారు. అంతేకాక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆటో డ్రైవర్లకు చేదోడు వాదోడుగా ఉండి వారి సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీయేనన్నారు. కార్మిక, కర్షకుల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ టిఆర్ఎస్ అని, కార్మికుల కష్టం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ని, బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆటో డ్రైవర్లు : అఫ్జల్, షాదుల్లా, హుస్సేన్, జాఫర్, రాజు, శేఖర్, పర్వీన్ నాయక్, గణేష్ నాయక్ తో పాటు మిత్ర బృందం సభ్యులు…
ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, సాయిలు యాదవ్, మహేందర్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొల్తూరి మల్లేష్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, దుండిగల్ గ్రామ మాజీ సర్పంచ్ గణేష్, వ్యవసాయ సొసైటీ సభ్యులు వెంకటేష్ యాదవ్, స్థానిక నాయకులు రాజశేఖర్ యాదవ్, రాము ముదిరాజ్, శ్రీశైలం, సుదర్శన్, పోతారం మల్లేష్, భాస్కర్, ఆర్. పురేందర్ రెడ్డి, గుర్రాల శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్ చౌదరి, నిఖిల్ రెడ్డి, రాజేష్ సెట్, వెంకట్ రెడ్డి, కుమారస్వామి, శ్రీను, ప్రసాద్, వేణు రెడ్డి, నాగబాబు, నారి, సోను, తదితరులు పాల్గొన్నారు.