బొల్లారం మున్సిపాలిటీలో అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని రాస్తారోకో
▪️ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన : కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న 519 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని మున్సిపాలిటీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ ధర్నాని పోలిసీలు అడ్డుకొని కాట శ్రీనివాస్ గౌడ్ ని అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. మండలంలో 519 కుటుంబాలు ఉంటే బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 75 మందికి దళిత బంధు ఇవ్వడం చాలా బాధాకరమని, దళితులందరికీ దళిత బంధు ఇచ్చేవరకు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ వడ్డె కృష్ణ, నర్సింగ్ రావు, సుధాకర్ గౌడ్, అశోక్ ముదిరాజ్, మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ క్రిష్ణ రెడ్డి, జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి, ఎంపీపీ రవీందర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు వీరారెడ్డి, శ్యామ్ రావు, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, దేవదానం, గోవర్ధన్ గౌడ్, నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బొల్లారం మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ క్రిష్ణ రెడ్డి, జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి, మహేష్ రెడ్డి, కౌన్సిలర్ సంతోష లక్ష్మారెడ్డి, ట్రెజరర్ ఇమ్రాన్, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, జయశంకర్ గౌడ్, రాధాక్రిష్ణ, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, ప్రవీణ్, బన్నీ, కీర్తన్ రెడ్డి, హరీష్, సాయి, పటాన్ చెరు నియోజకవర్గ మండల ప్రెసిడెంట్స్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, అమీన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.