బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

Spread the love

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఘవపూర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…

కాంగ్రెస్ పార్టీ నాయకుల కల్లే బొల్లి మాటలను నమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే దాసరి.
దశాబ్దాల కాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి ఒరగబెట్టింది ఏమో చెప్పాలన్నారు.
బీఅర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతీ కార్యకర్త, నాయకుడు ఒక్కో సైనికుడిలా పని చేయలన్నారు.
రాబోయే రోజుల్లో బీఅర్ఎస్ ను అధికారంలోకి తెచ్చే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలతో బీఅర్ఎస్ లో చిచ్చు పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు..వారి ఎత్తులను చిత్తు చేసి మూడవ సారీ ముఖ్యమంత్రి గా కేసిఆర్ ని గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుండి నడిపియ్యాలన్నారు…

ఈ కార్యక్రమంలో ఎంపీపీ,జడ్పీటీసీ,BRSV జిల్లా కో ఆర్డినేటర్, మండల పార్టీ అధ్యక్షుడు,వైస్ ఎంపీపీ, PACS & AMC ఛైర్మెన్ లు,డైరెక్టర్ లు,రైతు సమితి మండల కో ఆర్డినేటర్,జిల్లా డైరెక్టర్ లు,మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు,సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,గ్రామ శాఖ అధ్యక్షులు,రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ లు,గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page