Brand Ambassador for Municipal Development: Minister KTR
పురపాలక అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్ : మంత్రి కేటీఆర్
సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఏడ్మాసత్యం.
రాష్ట్ర మున్సిపల్ చైర్మెన్స్ ఛాంబర్ కార్యదర్శి ఎడ్మ సత్యం
యావత్ భారతదేశంలోపురపాలన,అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్ గా మంత్రి కేటీఆర్ ను పేర్కొనడం గర్వంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ చైర్మెన్స్ ఛాంబర్ కార్యదర్శి ఎడ్మ సత్యం అన్నారు.
తెలంగాణ మున్సిపాలిటీలు శరవేగంగాఅభివృద్దిచెందుతున్నాయనడానికి స్వఛ్చ్ సర్వేక్షణ్ అవార్డులే నిదర్శణమని అన్నారు.ఢిల్లీలో స్వచ్చ్ సర్వేక్షణ్ 2022 అవార్డులు అందుకున్న మున్సిపల్ చైర్మెన్లను ఛాంబర్ తరపునఘనంగాసన్మానించారు.
హైదరాబాద్ ఛాంబర్ కార్యాలయంలో శుక్రవారం చైర్మెన్ రాజు వెన్ రెడ్డి అధ్యక్షతన కార్యదర్శి ఎడ్మ సత్యం ఆద్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా చైర్మన్ల ఛాంబర్ కార్యదర్శి ఎడ్మ సత్యం మాట్లాడుతూ పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో తెలంగాణ మున్సిపాలిటీలు స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డుల సాధనలో దేశంలోనే అగ్రభాగాన నిలిచాయన్నారు.
దేశంలో 20222సంవత్సరంలో వంద స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటిస్తే అందులో మన రాష్ట్రం 26 పురస్కారాలు అందుకోవడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉంది అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో73మున్సిపాలిటీలు,కార్పోరేషన్లను 143 మున్సిపాలిటీలు,కార్పోరేషన్లుగా మార్చి పట్టణాల అభివృద్దికి శ్రీకారం చుట్టారు
.నూతన మున్సిపాలిటీల్లో మౌళికసదుపాయాలు,ఉపాధి కల్పన,రోడ్లు,పచ్చని పార్కులు,వైకుంఠధామాలు,హరితహారం,డబుల్ బెడ్ రూం ఇళ్లు,ద్వితియ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్స్ వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడంతో పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు.
అంతేకాదు రియల్ ఎస్టేట్,పారిశ్రామికీకరణ తారాస్థాయికి చేర్చిన ఘనత కేటీఆర్ కే చెందుతుందని చైర్మెన్ అన్నారు.ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మూడువేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం పురపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు..
ఈ కార్యక్రమంలో చైర్మన్ల ఛాంబర్ చైర్మెన్ రాజు వెన్ రెడ్డి , మునిసిపల్ ఛైర్మెన్స్ రాజమౌళి,రజిత,మంజుల,అనురాధ,జమున,కరుణ,జయబాబు తదితరులు పాల్గొన్నారు.