Bolla Brahmanaidu who took up the sapling program at YSR Jagananna Colony
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని వినుకొండ వైయస్ఆర్ జగనన్న కాలనీ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *
సాక్షిత : ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు పెడుతున్న శ్రద్ద అద్భుతమైన కార్యాచరణ అని , అందులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎంతో అదృష్టం అని తెలిపారు.
మొక్కలను పెంచుతున్నాం అంటే బౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిస్తున్నాం అని అర్ధం. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది. చెట్లు మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి.
అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి. ఇలా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి తో పాటు, వారితో పాటు వారి అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..