SAKSHITHA NEWS

కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో కి రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ వారి ఆధ్వర్యంలో 1,00,000 ఒక లక్ష చేప పిల్లలను చెరువులోకి వదిలిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ వారి ఆధ్వర్యంలో దుర్గం చెరువులో చేప పిల్లలను విడుదల చేయడం జరిగినది అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు ఒక వరమని, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ,మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. నీలి విప్లవం సాధనలో భాగంగా నీలి తెలంగాణ సాధనకై ముందుకు అడుగులు వేయడానికి ఎంతగానో దోహదపడుతుంది అని దానిలో భాగంగా ఉచిత చేపలు పంపిణి చేసి మత్స్య కారులను ఆదుకుంటుందని ,మత్స్య కారుల జీవితాల్లో వెలుగును నింపుతున్నారని,రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు . అదేవిదంగా ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోని సామాజిక బాధ్యత చెరువులను పరిరక్షించాలని ,చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ,నియోజకవర్గంలోని అన్ని చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి సుకీర్తి , గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉరిటీ వెంకట్రావు, రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ ప్రెసిడెంట్ సురేందర్ కుమార్ , మరియు సభ్యులు శ్రీశైలం, నరేందర్, అశోక్, సురేష్ , వీర స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS