SAKSHITHA NEWS


Blue revolution in Telangana

తెలంగాణలో నీలి విప్లవం
మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పటాన్చెరువు జిన్నారం మండలంలో పలు గ్రామాలకు చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్


సాక్షిత : తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

మత్స్య శాఖ ఆధ్వర్యంలో జిన్నారం మండలంలోని జిన్నారం, కొడకంచి, ఉట్ల, పుట్టగూడా, శివనగర్, మాదారం గ్రామాలకు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


SAKSHITHA NEWS