మల్లొక్కసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసుకుందాం: వికారాబాద్ BRS ఎమ్మెల్యే

Spread the love

మల్లొక్కసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసుకుందాం: వికారాబాద్ BRS ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : పువ్వులవర్షంతో, బతుకమ్మలు ఆడుతూ… ఎడ్ల బండ్లపై ఆటపాటలతో స్వాగతం పలికిన గ్రామాల ప్రజలు.
ప్రతి గ్రామంలో BRS పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.
మన ఇలాకాలో మంది పాలన మనకొద్దు – మన పాలన మనమే చేసుకుందాం…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మండలం పరిధిలోని పులుమద్ది, ఎర్రవల్లి, నారాయణపూర్, అత్త్వెళ్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.
మళ్ళీ గెలిచాక తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద గృహిణి మహిళలకు 3000 పెన్షన్ అందించే మరో నూతన పథకానికి BRS ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు.
మాజీల హయాంలో ఉన్న మండలానికో మధ్యవర్తి వ్యవస్థను మటుమాయం చేశాం, నేరుగా ప్రజలకే అందుబాటులో ఉన్నాం…


నారాయణపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డి యూసూఫ్, చింతలబొగుడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ రత్నయ్య, నాయకులు సాయిలు, గోపాల్, శ్రీనివాస్, సతీష్ శేఖర్ వారి అనుచరులు 30 మంది BRS పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 18 At 1.36.07 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page