SAKSHITHA NEWS

BJP state leaders visited IKP centers

ఐ కే పి సెంటర్లను సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు

సాక్షిత:పెద్దపల్లి బ్యూరో

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని గంగపురి లక్ష్మి పూర్ గ్రామాలలో ఐ కేపీ (వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ మంథని ప్రాంతంలో పలు మరి ఐకెపి సెంటర్లను సందర్శించడం జరిగింది

,కల్లం మీద వడ్లు వేసుకొని ఇన్ని రోజులు అవుతున్న కాంట కావడం లేదు,మన ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొన్న 24 గంటల్లో డబ్బులు ఇస్తా అని చెప్పి మరి 15 రోజులు అవుతున్న చాలా మందికి ఇంకా అకౌంట్ లో డబ్బులు వేయడం లేదు,ఇక్కడ రైతుల కోసం చూస్తే చాలా బాధాకరంగా ఉంది

రైతు కల్లం మీద రోజు వచ్చి కుప్పం వేసుకొని,లారీలు సారిగా రాక లోడింగ్ కాక ,లోడింగ్ అయిన వడ్లకి కూడా డబ్బులు వేయక,బస్తల కొరత కూడా ఉంధి,మిల్లార్ల లారీ లు మాత్రమే వస్తున్నాయి కాని ప్రభుత్వ కొనుగోలు లారీలు రావడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశకి నేత అని చెప్పుకుంటున్నాడు రైతు సమస్యలు గాలికి వదిలేసి, రుణమాపి లేక గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబంది పడుతున్నారు,

కేంద్రం ధర పెంచడం ద్వారా కొంత గిట్టుబాటు ధర పెంచింది, తేమ, జల్లాడా సాకు తో రైతు లని ఇబందులకు గురి చేస్తున్నారు, వడ్లు తొందరగా రవాణా చేసి డబ్బులు వేసేలా చేయాలనీ బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు, మంథని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, సీనియర్ నాయకులు చిలువేరి సతీష్, చేరుకుతోట సురేష్, అయింటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS