మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు రాంపల్లి, ఆర్టీసీ కాలనీ, ఆర్ ఎల్ నగర్, ఓయూ కాలనీలో 300 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అధికార దాహం కోసం యత్నిస్తున్న కాంగ్రెస్ కు ఓటమి తప్పదని అన్నారు.నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 యేళ్ళుగా ప్రజలను వంచనకు గురి చేసిందని ఆయన ఆరోపించారు.బిజేపి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో బిజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికి అవకాశం ఇచ్చారు. ఈ సారి నాకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు
బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…