అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి గ్రాడ్యుటి అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు ఇతర సమస్యలు పరిష్కరించాలని వారి డిమాండ్ కు మద్దతుగా సంఘీభావం తెలపడం జరిగింది
బిజెపి నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క నిరవధిక సమ్మె ఆచరణీయమైనదే తెలంగాణ లో 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు మీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేదలకు సేవలు అందిస్తున్నారు అయినా వీరికి కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదు దీనివల్ల అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తీవ్రంగా నష్టపోతున్నారు మన పక్కన ఇతర రాష్ట్రాలలో ఒక్కో విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నారు కానీ మన తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్స్ భద్రతలు లేవు అన్నారు
అంగన్వాడీ వర్కర్స్ అని పిలవబడేవారిని టీచర్స్ గా ప్రకటించిన కేసీఆర్ గారు వారికి పర్మనెంట్ చేయాలి కనీసం గవర్నమెంట్ టీచర్స్ లాగా వేతనం 20,000 పైన ఇవ్వాలి ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని బిజెపి తరఫున డిమాండ్ చేస్తున్నాను