చిత్రే గడ్డ శివాలయం స్థలం కబ్జాకు వ్యతిరేకంగా బిజెపి నేతలు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా
సికింద్రాబాద్ సాక్షిత : ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో చిత్రే గడ్డ శివాలయం స్థలం కబ్జాకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా చేశారు.కూకట్ పల్లి బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు,బీజేవైఎం యువ నాయకుడు కర్నే ప్రకాష్, కిషన్ మోర్చా ప్రెసిడెంట్ ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో పెద్దఎత్తున నేతలు పాల్గోని వివాదస్థలంలో ఏర్పాటు చేసిన రేకుల ప్రహారి తొలగించారు.
సిక్కుల గురుద్వారా కోసంజెండానుపాతి పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఓల్డ్ బోయిన్ పల్లి119 డివిజన్ లోని సీఎస్14 భూమిలో ఉన్న స్వయంబు శివాలయానికి ఉన్న ప్రధాన దారిని మూసివేసి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు. కబ్జాదారులు వెనుక స్థానిక కూకట్ పల్లి ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ హస్తముందని స్థానిక నాయకులు వెల్లడించారు, దారినిపునరుద్ధరించడంతో పాటు 2000గజాల స్థలాన్నికేటాయించాలని,గురుద్వారాకు 500గజాల స్థలన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.గుడి స్థలాన్ని కాపాడడంతోపాటు గురుద్వారాకు స్థలన్ని కేటాయించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలోధర్నాలో పాల్గొని కబ్జాదాలకు వ్యతిరేక నినాదాలు చేశారు.