SAKSHITHA NEWS

BJP leader killed in power struggle

ఆధిపత్య పోరులో బిజెపి నాయకుడు హత్య

సాక్షిత కర్నూల్

కర్నూలు జిల్లా ఈనెల 7వ తేదీన కౌతాలం మండలంలోని పాత కుంబలనూర్ గ్రామ చివరన జరిగిన ఈడిగ శివకుమార్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేదించారు
ఈ కేసులో ప్రధానంగా ఐదుగురు ముద్దాయిలైన రామన్న బసన్న గౌడ్, హరిజన దేవన్న హరిజన రాము, హరిజన ముదియప్ప, రామన్న గౌడ్ ను డిఎస్పి కార్యాలయంలో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు కౌతాళం మండలం నది చాగి గ్రామానికి చెందిన రామన్న గౌడ్ గ్రామంలో ఓ ప్రధాన పార్టీలోకొనసాగుతున్నాడు. ఇతనికి అనుచరుడిగా ఈడిగా శివకుమార్ గౌడ్ గా ఉంటూ రాజకీయాల్లో తిరిగేవాడు


ఈ ఇద్దరు కలిసి 2015 సంవత్సరంలో పొలం విషయంలో అదే గ్రామానికి చెందిన డీలర్ ఈరన్న ను చంపిన కేసులో ముద్దాయిలుగా ఉన్నారు.ఈ కేసును పెద్దమనుషుల సమక్షంలో కేసును కొంత డబ్బు ఒప్పందం కుదుర్చుకుని రాజీ చేసుకున్నారు


ఈ విషయంలోనే రామన్న గౌడ్ కు మరియు ఈడిగ శివకుమార్ గౌడ్ కు మనస్పర్ధలు వచ్చి రాజకీయంగాను మరియు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో రామన్న గౌడ్ అనుచరుడైన దేవన్న పై ఈడిగ శివకుమార్ గౌడ్ కత్తితో దాడి చేసిన ఘటనలో కౌతాళం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో వారి మధ్య కక్ష్యలు మరింత తారస్థాయికి చేరుకుంది


దీనంతటికీ కారణం రామన్న గౌడ్ అని శివకుమార్ గౌడ్ భావించి ఎలాగైనా రామన్న గౌడ్ హత్య చేయాలని 2021 నవంబర్లో కర్ణాటకలో అతనిపై దాడి చేయగా అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు


మరోసారి శివకుమార్ కర్ణాటక కు చెందిన మాన్వి కి చెందిన గ్యాంగ్ తో సఫారీ మాట్లాడుకొని రామన్న గౌడ్ హత్య చేయుటకు పథకం వెయ్యగా పోలీసులు చాకచక్యంగా ఆ గ్యాంగ్ పట్టుకుని కేసు నమోదు చేశారు తర్వాత రాజకీయంగా ఇరువురు సదరు ఒకే పార్టీలో ఇమడలేక తలో ఒక పార్టీలో ఉన్నారు

ఈ వ్యక్తిగత కక్షల నేపథ్యంలో శివకుమార్ గౌడ్ మూకుమ్మడిగా దాడి చేసి కళ్ళల్లో కారం పొడి కొట్టి వేట కొడవళ్ళతో అతి కిరాతకంగా నరికి చంపి కర్ణాటక రాష్ట్రం మన్వి పారిపోయారు
ఆదోనికి లాయర్ ను నిమిత్తం కలవడానికి వస్తుండగా కోసిగి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వేట కోడవళ్లను రెండు ద్విచక్ర వాహనలను స్వాధీనం చేసుకున్నారు ఆధిపత్య పోరులో భాగంగా హత్య చేసినట్లు డిఎస్పి వినోద్ కుమార్ వెల్లడించారు


SAKSHITHA NEWS