తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తూట్లు పొడుస్తున్న కేసీఆర్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తూట్లు పొడుస్తున్న కేసీఆర్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన 24 గంటల ఉపవాస దీక్షకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. గాజులరామారం లోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయం నుండి భారీ కార్ల ర్యాలీగా ఇందిరా పార్క్ చేరుకొని కిషన్ రెడ్డి కి మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఇంచార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page