SAKSHITHA NEWS

సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డ్ ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి బిజెపి హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో బస్తీ – బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ హౌస్ ఫేడ్ చైర్మన్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి హాజరై కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగవ వార్డ్ లోని సకినాల లలిత కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చేర్పిస్తే ఆరోగ్య శ్రీ పథకం కూడా వర్తించలేదని చెప్పడంతో లక్షల రూపాయల దారబోసి హాస్పిటల్ చుట్టూ తిరిగితే చివరకు కడుపుకోత మిగిలిందని కన్నీరు పెట్టుకుందన్నారు. తన కుమారుడు మరణించినంతరం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే రూపాయి పైసా కూడా రాలేదని ఏడ్చిన హృదయ విదారకమైన పరిస్థితి బస్తీల్లో కనబడిందన్నారు. ముస్లిం మహిళ మాట్లాడుతూ ఇంటి వద్ద చెత్త చెదారంతో మోరి దుర్వాసన వ్యర్థాలతో మేము అనారోగ్య బారినపడుతున్నామని, ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలా ప్రతి ఇంటికి బాధ, ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి నయా పైసా అందలేదని కాలనీ వాసులు ఆక్రోశం వ్యక్తం చేశారు.17వ తేది గురువారం రోజున ఉదయం 11.30ని.లకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని, మండలంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివారు దళిత గిరిజన బీసీ మైనారిటీ బంధు రానివారు ధర్నాకు పెద్దఎత్తున రావాలని కోరారు.

ఈ బస్తీ బాట కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, మండల అధ్యక్షులు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని సతీష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి బొల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తగరం లక్ష్మణ్, గాదాసు రాంప్రసాద్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్,మండల కోశాధికారి ఇటిక్యాల కుమారస్వామి, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు బొప్పిశెట్టి భీమేశ్వర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బత్తుల కుమారస్వామి, మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి లకావత్ శారద, ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, బీజేవైయం పట్టణ అధికార ప్రతినిధి అశాడపు శ్రీనివాస్, కార్యదర్శి అబ్బిడి లింగారెడ్డి, ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి లావుడ్య రైనా నాయక్, బీజేపీ నాయకులు కోమటి సత్యనారాయణ,వంగర మల్లేశం, అక్కు శ్రీనివాస్, జున్నోజు శ్రీకాంత్, పెందోట భూశంకర్, నారోజు నరేష్, ఎర్రోజు సాయి కృష్ణ, న్యాలం సందీప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS