జగదీశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Spread the love

Birthday celebrations of CM YS Jaganmohan Reddy under the leadership of Jagadishwar Gupta

జగదీశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
జగనన్న జన్మదినం జనులందరికీ పర్వదినం


నేరేడ్మెట్ సాక్షిత ప్రతినిధి;-

ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం రోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జగదీశ్వర్ గుప్త ఇంటి వద్ద వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ నవరత్నాలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీలే కాకుండా ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా పాలన అందిస్తున్నారని అన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి దేశంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం లలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకొని పెద ప్రజలకు ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా దివంగత మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో కూడా రాజన్న బిడ్డ షర్మిలమ్మ తెలంగాణలో తొలి మహిళ ముఖ్యమంత్రి కావాలని ఏడుకొండల వెక్కన్న స్వామి వెడుకూంటు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్ యాదవ్, గణేష్, సాయి, రోహిత్, వెంకట్ రావు, అచ్యుతరావు రమేష్, వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page