భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు.
తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. అతను తండ్రిని వదిలేయడంతో సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పిటిషన్ ఫైల్ చేశారని భీమదేవరపల్లి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి తిరిగి తండ్రికి భూమి పాస్ బుక్ అందించారు.