ప్రాణం పోయినా పార్టీ మారను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మున్సిపాల్టీ సీనియర్ నాయకురాలు, 13 వ వార్డు కౌన్సిలర్ నూర్జహా బేగం తౌఫిక్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భీమ్ భరత్ మాట్లాడుతూ మండలంలో మరియు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయని, బిఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఒక్కటీ కూడా స్థానికులకు ఇవ్వలేదన్నారు. మండలంలో, మున్సిపాలిటీలో సమస్యలు చాలా ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డకా అన్ని పరిష్కరించుకుందామన్నారు. తను అందరికీ అందుబాటులో ఉంటానని, సమస్య ఉందని చెప్తే తనే ప్రజల వద్దకు వస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎర్రోళ్ల రామచందర్, ఆర్కే గౌస్, మోహిన్, శ్రీశైలం యాదవ్, సంజీవ, గౌస్, ఉస్మాన్, రామకృష్ణారెడ్డి, ఆరిఫ్, ప్రవీణ్, ఇద్రిస్, సుధాకర్ రెడ్డి, సర్ధాజ్, మైనార్టీ నాయకులు, కాలనీ మహిళలు ఉన్నారు.
ప్రాణం పోయినా పార్టీ మార! శంకర్పల్లి ని అభివృద్ధి చేస్తా: పామెన భీమ్ భరత్
Related Posts
ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది
SAKSHITHA NEWS ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రశ్నోత్తరాలలో భాగంగా “విద్యార్థులకు విదేశీ విద్య ఉపకార వేతనాలపై” అంశంపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన…
బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం
SAKSHITHA NEWS బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వేషంలో వస్తూ రోజుకో డ్రామా చేస్తున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ…