దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో సాయంత్రం కవిత భర్త అనిల్‌కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. తొలి రోజైన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ఈడీ విచారించింది. విచారణ ముగిసిన తర్వాత ఆమెను కలవడానికి కుటుంబసభ్యులకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈడీ కార్యాలయం వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా వచ్చినా.. వారు బయటే ఉండిపోయారు. కవితను కలిసిన తర్వాత కుటుంబసభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత
Related Posts
లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ
SAKSHITHA NEWS లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూత కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం…
మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…
SAKSHITHA NEWS మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… న్యూఢిల్లీ, : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని..…