ఆలయ మర్యాదలతో నామ అర్చకులు స్వాగతం , ప్రత్యేక పూజలు
నామ అర్చకుల ఆశీర్వచనాలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాములను దర్శించుకుని, ,ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ఆలయ మర్యాదలతో నామ నాగేశ్వరరావుకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేసి, నామ ను ఆశీర్వదించారు. మంచి మెజార్టీతో విజయం సాధించి, ప్రజలకు సేవలoదించాలని అర్చకులు దీవిస్తూ, ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరి జీవన్, మోరంపూడి ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ , మానే రామకృష్ణ . మండల పార్టీ నాయకులు ఆకోజు సునిల్ కుమార్, నామ యూత్ నాయకుడు దుద్దుకూరి రాజా, కోలా రాజు, ఎస్ కే అజీమ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కమ్మ సంఘo ఆధ్వర్యంలో నామను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో ..
ఈ సందర్భంగా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని కూడా నామ నాగేశ్వరరావు సందర్శించి, అమ్మ వారికి పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో అర్చకులు నామ కు స్వాగతం పలికి, వేదమంత్రోచ్చరణతో ఆశీర్వదించి, దీవించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా పాల్వంచ లో రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో మున్సిపల్ కార్మికుల తో కలిసి నామ టీ సేవించి, వారితో మాట్లాడారు.