ప్రగతి యాత్ర‘లో భాగంగా 74వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
జగద్గిరిగుట్ట డివిజన్ షిర్డీ హిల్స్-ఏ, బీలలో పాదయాత్ర…
పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
బస్తీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్-ఏ, బిలలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 74వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిపై చర్యలు తీసుకొని వేగంగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. అదే విధంగా షిర్డీ హిల్స్-బిలో ఎస్.డి.ఎఫ్ నిధులతో నూతనంగా చేపడుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన, బుద్ధ భవన్ కంపౌండ్ వాల్ పనులకు, సంజయ్ పురి కాలనీలో భూగర్భడ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో గుర్తించని అనేక బస్తీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బస్తీల రూపు రేఖలు మారాయన్నారు. ప్రజల సౌకర్యాల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, బాబు గౌడ్, వేణు యాదవ్, పాపిరెడ్డి, బండ మహేందర్, దాస్, శశిధర్, విఠల్, సయ్యద్ సాజిద్, మనోజ్, నాగరాజు, అజాం, వెంకటేష్, రెహాన్ తదితరులు పాల్గొన్నారు.