భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన

Spread the love

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వరరావు , డిప్యూటీ DMHO శ్రీమతి సృజన ,డీసీ వెంకన్న , కార్పొరేటర్లు శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద మరియు మద్య తరగతి ప్రజలకు అందుబాటులో ఈ బస్తి దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగినది అని ,ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోయఁగ పర్చుకోవాలిని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు .అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బస్తీ ధవాఖానాల ఏర్పాటు చేసిన విషయం విదితమే అని ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ,పేద ప్రజలకు,మధ్య తరగతి ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పం తో ముఖ్యమంత్రి కెసిఆర్ బస్తి దవాఖాన ఏర్పాటు చేయడం జరిగినది అని.బస్తి దవాఖాన ల ద్వారా పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

మన బస్తీలో.. ఇంటి పక్కనే వైద్యం.. అదీ ఉచితంగా.. ఇప్పటికే నగరంలోఅందుబాటులో ఉన్న బస్తీ దవాఖానలు మరింత విస్తృతం అవుతున్నాయి.. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు.ఆపత్కాలంలో ఆదుకున్న బస్తీ దవాఖానలు. ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర, ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో రోగులు ఉస్మానియా, నిలోఫర్‌ లాంటి వైద్యశాలలకు వెళ్లలేకపోయారు ఈ ఆపత్కాల సమయంలో బస్తీ దవాఖానాలే ఆదుకున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా బస్తీ దవాఖాన లో
55 రకాల వైద్య పరీక్షలు చేయబడును అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయ్యప్ప సొసైటీ కాలనీ మరియు చుట్టుపక్కల వారికి, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని. ఈ బస్తి దవాఖానాలు ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉండడం వలన ప్రజలకు సరైన సమయంలో వైద్యం లభించునని ఎమ్మెల్యే పేర్కొన్నారు ,ఈ బస్తి దవాఖానాలు పేద ప్రజల ఆరోగ్యానికి ఎంతో భరోసా అని ,ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు . అదేవిధంగా బస్తి దవాఖానాలు ఏర్పటు కై బస్తీలలో ,ప్రజలు ఎక్కువ నివాసం ఉన్న ప్రాంతలలో సరైన భవనాలు లేని చోట ఎమ్మెల్యే గాంధీ సొంత నిధుల తో మరియు దాతల విరాళాలతో కంటైనర్ లు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా వైద్య సదుపాయాలు అందుబాటలోకి వస్తాయని ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్సు , ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉండి మెరుగైన సేవలను అందిస్తారని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వారు స్పష్టం చేశారు. వైద్యరంగంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ దవాఖానాల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుందన్నారు , ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేయబోతున్నామని చెప్పారు. పేదలకు ప్రభుత్వం ఆరోగ్య భరోసా కల్పిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్,నాగమణి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎం.ఐ.జి అధ్యక్షుడు భాస్కర్ ముదిరాజ్,వార్డ్ మెంబర్ తీలావత్,చిన్న,వెంకట్ రావు,వెంకట్ రెడ్డి,రాకేష్ మరియు అధ్యక్షుడు మహిళ సంఘాల నాయకురాలు రాణి, జ్యోతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page