టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Spread the love

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యం లో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు,

  • ఈ సంబరాలలో దాదాపు 1200 కి పైగా కెనడా తెలంగాణ వాసులు స్థానిక Oakville Legacy Banquet & Convention centre -Oakville లో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. * ఈ కార్య్క్రమము మొదట అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద మరియు గవర్నింగ్ బోర్డు ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించగ శ్రీ మతి దీప గజవాడ, బతుకమ్మ లను సమన్వయ పరిచారు.
  • ఈ కార్యక్రమములో TCA వారు అతిపెద్ద 6ft బతుకమ్మను తయారుచేసి ఆడిన తీరును ప్రజలను ఎంతగానో ఆకట్టుకొన్నది. పలు వంటకాలతో potluck డిన్నర్ ఆరెంజ్ చెయ్యటం విశేషము
  • ఈ సందర్బంగా ప్రస్తుత కమిటి అధ్యక్షడు రాజేశ్వర్, నూతన కమిటి అధ్యక్షడు శ్రీ శ్రీనివాస్ మన్నెం మరియు కొత్త గవర్నింగ్ బోర్డు టీం 2022-24 కు గాను సభాముఖంగా ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియచేసారు.
  • ఈ సందర్బంగా బతుకమ్మ ఆట సుమారు 6 గంటలు ఏకధాటిగా ఆట పాటలతో మగువలు , చిన్నారులు బతుకమ్మ ఆడి చివరగా పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగ నిమజ్జనం చేశారు మరియు సత్తుపిండి, నువ్వులపిండి , పల్లీలపిండి ఫలహారాలు పంపిణి చేసారు
  • ఈ కార్యక్రమానికి ఈవెంట్ కో స్పాన్సర్స్ పబ్బ రియాల్టీ నుండి శ్రీనివాస్ పబ్బ, శ్వేతా పుల్లూరి, Townhill కన్స్ట్రక్షన్, లవ్ ప్రీత్ టీం, మరియు Get-Home Realty నుండి, ప్రశాంత్ మూల, Remax నుండి మానస్వని వేళాపాటి, హోమ్ లైఫ్ లాండ్మార్క్ ఇంక్. బ్రోకరేజ్ రియాల్టీ నుండి రికెల్ హూంగే మరియు బెస్ట్ బ్రైన్స్ లెర్నింగ్ సెంటర్-OAKVILLE లు వ్యవరించగ ప్రెసిడెంట్ రాజేశ్వర్ ఈద వారిని శాలువాలతో అభినందించి మొమెంటోస్ బహుకరించారు
  • ఈ కార్యక్రమములో బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ శ్రీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజ్రెరర్ శ్రీ నవీన్ ఆకుల మరియు కల్చరల్ team శ్రీమతి దీప గజవాడ, మరియు కార్యవర్గసభ్యు లు, గిరిధర్ క్రోవిడి, ఉదయ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి మరియు బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యు లు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి మరియు, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి మరియు శ్రీనాథ్ కుందూరి పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page