బస్తీలలో సుస్తీని దూరం చేసేందుకు బస్తీ దవాఖానలు…

Spread the love


Basti Davakhanas to remove fatigue in slums…

బస్తీలలో సుస్తీని దూరం చేసేందుకు బస్తీ దవాఖానలు…

జగద్గిరిగుట్టలో పేద ప్రజలకు అందుబాటులోకి బస్తీ దవాఖాన.. ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల వైద్య సౌకర్యాలను కల్పించిందని అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కావడంతో జగద్గిరిగుట్టలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు.

స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన బస్తీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ నిర్మల, మెడికల్ ఆఫీసర్ హర్షిత మరియు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, ఎత్తరి మారయ్య, వేణు యాదవ్, ఇందిరా గౌడ్ మరియు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page