బాలానగర్ లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

Spread the love

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గము బాలానగర్ లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

*
సాక్షిత,: *ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 90 లక్షల సొంత నిధులతో నిర్మించిన మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.

కూకట్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ బ్యాగ్ లు, నోట్ పుస్తకాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసారు.

నియోజక వర్గంలో 44 ప్రభుత్వ పాఠశాలలో చదివే 11 వేల మంది విద్యార్థులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, స్టేషనరీ అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి ,నవీన్ రావు ,కలెక్టర్ హరీష్ ,కార్పొరేటర్లు, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారన్నారు.

కూకట్ పల్లి నియోజకవర్గములోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10/10 సాధిస్తే 18 వేల విలువ చేసే ట్యాబ్ లను ఎమ్మెల్యే కృష్ణారావు ఇవ్వటం అభినందనీయమన్నారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్వంత నిధులతో ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.

కోవిడ్ కాలంలో విద్యార్థులకు డిజిటల్ విద్యా అందించటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది.

ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై 1 లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్నారు,దేశంలోని ఇతర రాష్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి.నాణ్యమైన విద్యా, భోజనం,మంచి ఫలితాలు సాధిస్తుందటముతో గురుకులాలకు డిమాండ్ పెరిగింది.

కె జి టూ పీజీ ఉచిత విద్య లో భాగంగా రాష్ట్రంలో 8 ఏళ్ళ కాలంలో అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే.

రాష్ట్రము వచ్చినపుడు ఉన్న 400 జూనియర్ కళాశాలలకు తోడుగా 1150 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, 70 డిగ్రీ,2 పీజీ,లా కళశాలలు ఏర్పాటు చేయటం జరిగింది.

పుస్తకాల కోసం 2021-22 విద్యా సంవత్సరం లో 60 కోట్ల నిధులు వెచ్చించగా.2022-23 విద్యా సంవత్సరంలో రెట్టింపు గా 120 కోట్ల 80 లక్షలు ఖర్చు చేయటం జరిగింది.

Related Posts

You cannot copy content of this page