తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, కుటుంబ బంధాలు తెలియజేస్తూ తీసిన బలగం సినిమా

Spread the love

సాక్షిత : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, కుటుంబ బంధాలు తెలియజేస్తూ తీసిన బలగం సినిమాను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో కొంపల్లిలోని సినీ ప్లానెట్ లో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, బలగం సినిమా కొమురయ్య పాత్ర దారి సుధాకర్ రెడ్డి పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, దుండిగల్ వైస్ చైర్మన్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేటర్లు, కొంపల్లి చైర్మన్, కౌన్సిలర్లు, దుండిగల్ కౌన్సిలర్లు, పార్టీ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page