SAKSHITHA NEWS

Background of the 34th Road Safety Week celebrations

34 వ రహదారి భద్రత వారోత్సవాల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు ఏలూరు అమీనా పేట లో ఉన్న సురేష్ బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణ నుండి హెల్మెట్ ర్యాలీని ప్రారంభించి, జిల్లా ఎస్పీ స్వయముగా మోటార్ సైకిల్ హెల్మెట్ వద్ద ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపినారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతూ ఎక్కువ ప్రాణా నష్టం మరియు శారీరకంగా నష్టాలు జరుగుతున్ననాయి అని, ఏలూరు జిల్లాలో నేషనల్ హైవే మరియు ఇతర రహదారులు పై రహదారి ప్రమాదాల నివారణ కొరకు జిల్లావ్యాప్తంగా బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని హైవేల నుండి క్రాస్ రోడ్డుకు వద్ద ప్రజలకు అవగాహన కొరకు రబ్బర్ పెయింటింగ్ లను చేసినట్లు, నిత్యం హైవే మొబైల్ ద్వారా హైవేలపై వాహన చోదకులకు వాష్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దానిపై రహదారి ప్రమాదాలను తగ్గించగలిగినట్లు,

అదే స్ఫూర్తితో రానున్న కాలంలో రహదారి ప్రమాదాల నివారణ కొరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు,

రహదారి ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవటం వలన ప్రాణాలు కోల్పోతున్నారని కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించడం వలన ప్రమాద సమయాలలో ప్రాణాపాయం కాకుండా కాపాడుకోగలుగుతారని,

ట్రాఫిక్ నియమని వందనం గురించి విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి స్కూలు కాలేజీలలో రహదారి ప్రమాదాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు,

రహదారి ప్రమాదాల నివారణ కొరకు ముందుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి తదనంతరం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలను విధిస్తామని.

రహదారి ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదములు జరగటం వలన మరణాలు అంగవైకల్యాలు సంభవిస్తున్నాయని కావున ప్రతి ఒక్కరూ వేగం వద్దు ప్రాణం వద్దు అనే విషయాన్ని గ్రహించాలని,

ఈ రహదారి భద్రత వారోత్సవాలను గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నామని నిన్న బ్లడ్ క్యాంపును నిర్వహించినామని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రత వారోత్సవాల అవగాహనను నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలియజేశారు

ఈ హెల్మెట్ ర్యాలీ కీ ఏలూరు ఇన్చార్జి డిఎస్పి జి వి ఎస్. పైడేశ్వరావు , అర్.టి. ఓ కె శ్రీహరి , ఏ.అర్ డిఎస్పీ కృష్ణంరాజు , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.విజయ రాజు , ఎస్.బి ఇన్స్పెక్టర్ వి రవికుమార్ ,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి స్వామి , జి ప్రసాద్ ,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి వై ఎస్ వి కళ్యాణి , ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్ , ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ పి చంద్ర శేఖర్ , అర్. ఐలు కృష్ణంరాజు ,ఎం. రాజ , ట్రాఫిక్ ఎస్ఐ శ్రీదర్ ,ఆర్టీవో ఆఫీస్ ఏవో ధనలక్ష్మి , ఏవో ఎం రాము డి.టి. ఆర్.బి ఎస్ఐ కె .రాంబాబు ,ఏలూరు 1 టౌన్ ఎస్ఐ రామ కృష్ణ ,ఏలూరు 11 టౌన్ ఇన్స్పెక్టర్ కె ప్రసాద్ , ఏలూరు 3 టౌన్ ఎస్ఐ శంకర్ , రవాణా శాఖ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది

ఈ హెల్మెట్ ర్యాలీ లో ఏలూరు పట్టణ ప్రజలు మరియు విద్యార్థులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ లో పాలుగొన్నారు.


SAKSHITHA NEWS