కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతీక అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఎల్లమ్మబండలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ రాముని శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ మరియు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయుల సుందర స్వప్నం అయోధ్య శ్రీరామ మందిర భవ్యక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలందరికి అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రీరాముని భక్తులు, ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతీక అయోధ్య రామ మందిరం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…