SAKSHITHA NEWS

నూతన చట్టాల గురించి అవగాహన-
మహిళల భద్రతయే.. మా మొదటి ప్రాధాన్యత”

  • సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ విద్యార్థి దశ నుండి ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
  • ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేయండి. – జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య

మహబూబాబాద్ జిల్లాలో మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య అన్నారు.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశానుసారంగా మహిళల, విద్యార్థినిల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా షీ టీం ను లేదా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అప్డేటెడ్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ లో
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో
విద్యార్థులకు మహిళా రక్షణ షీ టీమ్స్ , ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్స్, భరోసా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య మాట్లాడుతూ, విద్యార్థిని ,విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహిళలు చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని,ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
జిల్లావ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటాయని సూచించారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
మహిళలు యువతలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్స్ లేదా పోలీసు వారిని సంప్రదించాలని కోరారు. వేధింపులపై నేరుగా సంప్రదించలేనివారు షి టీం నెంబర్ 8712656935 ,7901142009 కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ప్రస్తుతం మహిళలపై వేధింపులు అగైత్యాలు, ఆర్థిక నేరాలు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నారు.

విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడితే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
చదువుకునే యుక్త వయసులో యువత ప్రలోభాలకు ,ఆకర్షణలకు గురై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసే ముందు మీ తల్లిదండ్రులకు కష్టాలను గుర్తు తెచ్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులను అర్థం చేసుకొని గౌరవిస్తూ వారి యొక్క కలలను నెరవేరుస్తూ,ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ టౌన్ డిఎస్పి తిరుపతి ,మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య గారు,షీ టీం ఎస్ఐ సునంద , మరియు షీ టీం సిబ్బంది, భరోసా టీం జయశ్రీ, పోలీస్ కళాజాత బృందం, మరియు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అప్డేటెడ్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సుజాత మేడం మరియు వారి యొక్క అధ్యాపక బృందం, మరియు విద్యార్థిని విద్యార్థులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కేసముద్రం విద్యార్థినీ విద్యార్థులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

PRO to SP మహబూబాబాద్


SAKSHITHA NEWS