తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భౌరంపేట్ లో ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు

Spread the love

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భౌరంపేట్ లో ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు..
కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని అందించిన కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి …


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యా దినోత్సవాన్ని దుందిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల లో నూతనంగా నిర్మించిన గ్రంధాలయాన్ని కౌన్సిలర్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రతీ సంవత్సరం 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందచేయడం జరుగుతుంది . ఈ సంవత్సరం కూడా 6 మంది విద్యార్థులకు మొదటి బహుమతిగా 5000 రూపాయలు రెండవ బహుమతిగా 4000 రూపాయలు మూడవ బహుమతిగా 3000 రూపాయలు మొత్తంగా 24000 రూపాయలను అందచేసారు.

అనంతరం విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న ఉచిత స్కూల్ యూనిఫామ్స్ మరియు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను విద్యార్థులకు అందచేసారు. వారు మాట్లాడుతూ తెలంగాణ లో గత ప్రభుత్వాల వల్ల నిర్లక్షానికి గురైన సర్కారు విద్యకు జీవం పోసి నాణ్యమైన విద్యను BRS ప్రభుత్వం అందచేస్తుందని అన్నారు. విద్యార్థులందరు కూడా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ ZPHS ప్రధానోపాధ్యాయులు N. రామిరెడ్డి , UPS ప్రధానోపాధ్యాయులు యేసయ్య మరియు గ్రామ పెద్దలు మల్లారెడ్డి , బుచ్చిరెడ్డి , నాయకులు బల్వంత్ రెడ్డి , మన్నె శేఖర్, కృష్ణారెడ్డి , మన్నె బాలరాజు , ప్రదీప్ రెడ్డి , డాక్టర్ ప్రేమ్ కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page