SAKSHITHA NEWS

సామాజిక న్యాయంలో పుట్టిన వ్యవస్ధలు…
ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌.. లంచాలు, వివక్షలేకుండా ప్రతి పేదవాడు, రైతన్నను, అక్కచెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ, అంబేద్కర్‌ కలలుగన్న రాజ్యం ఇది అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు.

ఇవన్నీ సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్ధలు. కాబట్టి మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనేదాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ రోజు ఆవిష్కరణ కూడాæ చేస్తున్నాం.

మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా ప్రతి గ్రామం నుంచి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ప్రతి గ్రామంలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రాంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కనిపించేటట్టుగా జిల్లాలో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది.

వైద్య, ఆరోగ్య రంగంలో ఎప్పుడూ ఊహించని విధంగా గ్రామ స్థాయిలో మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తాయి. ప్రతి అంశంలోనూ పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ… ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ఇక్కడి నుంచి అందరం బయలుదేరి అక్కడికి పోదాం అని పిలుపునిస్తూ… సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Whatsapp Image 2024 01 20 At 8.40.48 Am

SAKSHITHA NEWS